LOADING...
AP GST Appellate Tribunal: ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం.. విజయవాడ, విశాఖలో బెంచ్‌లు
విజయవాడ, విశాఖలో బెంచ్‌లు

AP GST Appellate Tribunal: ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం.. విజయవాడ, విశాఖలో బెంచ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీకి సంబంధించిన అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ట్రైబ్యునల్ ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా విజయవాడలోని లబ్బిపేట బృందావన్ కాలనీలో ఉన్న వినయ్‌గర్ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్ నంబర్-401లో ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ వివాదాలు, అప్పీళ్ల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా రెండు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఏపీ జీస్టాట్ ఉపాధ్యక్షుడిగా భాస్కర్‌రెడ్డి వేమిరెడ్డి, సాంకేతిక సభ్యుడు (సెంట్రల్)గా సతీష్‌కుమార్ అగర్వాల్‌ను ట్రైబ్యునల్ బెంచ్ సభ్యులుగా నియమించారు.

వివరాలు 

అప్పీళ్లు,దరఖాస్తులు ఆయా జిల్లాలకు కేటాయించిన బెంచ్‌లలోనే దాఖలు చేయాలి 

విజయవాడ బెంచ్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం బెంచ్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలను చేర్చారు. సంబంధిత జిల్లాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు, జీఎస్టీ శాఖ అధికారులు, అధికారిక ప్రతినిధులు, ఇతర దరఖాస్తుదారులు తమ అప్పీళ్లు, దరఖాస్తులు ఆయా జిల్లాలకు కేటాయించిన బెంచ్‌లలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.

Advertisement