Page Loader
Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట
జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట

Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట

వ్రాసిన వారు Stalin
Apr 16, 2024
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్థాపించిన జనసేన(Janasena)పార్టీకి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. గ్లాసు(Glass)గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్లు హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్ ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో జనసేన పార్టీకి ఊరట కలిగినట్లైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన పార్టీకి గుడ్ న్యూస్