Loading...
Andhra Pradesh :ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు
ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు

Andhra Pradesh :ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న, పదవీ విరమణ చేసిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో మరోసారి విచారణ ఎదురుకానుంది. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించి న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులను అధికారులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరగనుంది. జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. సచివాలయ సిబ్బంది, ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్లు, టీటీడీ ఉద్యోగులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

వివరాలు 

మరింత సమయం కోరిన ప్రభుత్వం

సూపర్‌న్యూమరరీ పోస్టుల కేటాయింపు, అంతర్రాష్ట్ర సీనియారిటీ నిబంధనల అమలు,ఇతర సర్వీసు ప్రయోజనాల కల్పనకు సంబంధించి 2018 నుంచి హైకోర్టు పలు ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లు పేర్కొంటున్నారు.

అయితే, ఆ ఆదేశాలను అధికారులు ఇప్పటికీ అమలు చేయడం లేదని తమ పిటిషన్లలో ఆరోపించారు.

అక్టోబర్ 30న ఈ కేసులపై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 13కి వాయిదా వేసింది.

ఖాళీల లెక్కింపు, కొత్త పోస్టుల సృష్టి,సీనియారిటీ సమస్యల పరిష్కారంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు.

కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.

అయితే, న్యాయస్థానం గతంలో ఇచ్చిన కీలక ఆదేశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని పిటిషనర్లు వాదిస్తున్నారు.

వివరాలు 

మరింత సమయం కోరిన ప్రభుత్వం

ఇదిలా ఉండగా, ఈ కేసుల్లో కొత్తగా ప్రతివాదులుగా చేరిన అధికారులు రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ధర్మాసనం గతంలో ఆదేశించింది.

ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లు సమర్పించిన అధికారులు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది.

దీంతో నవంబర్ 13న జరిగే విచారణపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT