LOADING...
AP Inter Results 2026: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Results 2026: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేశారు. విడుదలైన ఫలితాల ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 53 శాతం మంది పరీక్షల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు, తమ మార్కులను మెరుగుపరుచుకున్న అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

వివరాలు

వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందారు.

Advertisement