AP Intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది. ఫలితాల వివరాలను కౌన్సిల్ కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. https://resultsbie.ap.gov.in, https://results.bie.ap.gov.in, https://examsresults.ap.nic.in, results.apcfss.in bie.ap.gov.in 10.5 లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణి జిల్లా తొలి స్థానంలో ఉండగా..సెకండియర్ ల్లో కృష్ణా జిల్లాయే 90 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో ఉంది.
ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడి
ఫెయిల్ అయ్యిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలకు పూనుకోవద్దు
ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. ఈ సారి బాలికల కంటే కూడా బాలుర ఉతీర్ణత శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.తల్లి తండ్రులు.. పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు. ఈసారి తప్పిన విద్యార్థులు.. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. ఈసారి బాగా రాసి.. మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు.