Loading...
Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరు నెలల మందుల నిల్వలు.. రూ.275 కోట్లు కేటాయింపు

Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరు నెలల మందుల నిల్వలు.. రూ.275 కోట్లు కేటాయింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ కొనుగోలు విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై మూడు నెలలకు ఒకసారి కాకుండా.. ఆరు నెలల అవసరాలకు సరిపడా మందులను ముందుగానే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు, సర్జికల్స్ కొనుగోలు చేసేందుకు రూ.275 కోట్ల అంచనాతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఈ నెల 10న ప్రక్రియ ప్రారంభించిందని మంత్రి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

2018 నుంచి 2022 మధ్య మందుల కొనుగోలు, సరఫరాలో అనేక లోపాలు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 2022 మధ్య మందుల కొనుగోలు, సరఫరాలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని మంత్రి తెలిపారు.

ఈ అంశంపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో ప్రస్తావించిన లోపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు పటిష్ఠమైన నూతన కొనుగోలు విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.

ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు, సర్జికల్స్ ముందుగానే అందుబాటులో ఉంచడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT