AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన 8 ముఖ్యమైన బిల్లులకు శుక్రవారం శాసనమండలి తమ ఆమోదాన్ని తెలిపింది. అలాగే, విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరుతూ శాసనమండలి ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.
మండలిలో ఆమోదం పొందిన బిల్లుల వివరాలు
చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసనమండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు శాసనమండలి ఆమోదం. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కు మండలి ఆమోదం. ఏపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం. ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థల దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి శాసనమండలి ఆమోదం. ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మండలి ఆమోదం. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024రద్దుకు మండలి ఆమోదం తెలిపింది. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు కూడా ఆమోదం తెలిపింది. కీలకమైన ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తరువాత,శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.