LOADING...
AP Liquor Case: ఏపీ మద్యం కేసు.. నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు
ఏపీ మద్యం కేసు.. నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు

AP Liquor Case: ఏపీ మద్యం కేసు.. నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్‌, ధనుంజయరెడ్డి నివాసాల్లో శుక్రవారం ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నగరాల్లో కూడా సిట్‌ నివేదిక ఆధారంగా ఈడీ దాడులు చేపట్టింది. మద్యం విక్రయాల ద్వారా సేకరించిన అక్రమ డబ్బును షెల్‌ కంపెనీలకు మళ్లించి లాభాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే జరిగిన దర్యాప్తులో సుమారు రూ.1,000 కోట్ల మేర ముడుపులు చలామణి అయినట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement