LOADING...
#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?
ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?

#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో అవినీతి డబ్బులను వైట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రాను ముంబైలో పట్టుకుని విచారణకు తీసుకొచ్చి, తరువాత రిమాండ్‌కు పంపించారు. ఆయనను అదుపులోకి తెచ్చే ముందు, ముంబైలోనే అధికారులు డబ్బుల రూటింగ్ విధానం, ఎవరి డబ్బు ఎలా మార్చారన్నది పూర్తిగా తెలుసుకున్నారు. ఆ విచారణ తరువాత అధికారికంగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పేరుతో చేసిన లావాదేవీల్లోనూ చోక్రా పాత్ర స్పష్టమైందని, సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. అంత వరకూ బాగుంది కానీ అసలు సూత్రధారి గురించి ఎప్పుడు బయటకు వస్తుందన్నది కీలకంగా మారింది.

వివరాలు 

స్కామ్ ప్రధాన సూత్రధారి బయటకు రాకపోతే మొత్తం కృషి వృథా

ఐదేళ్లపాటు సాగిన లిక్కర్ దందాలో అసలు అంతిమ లబ్దిదారు ఎవరో ఏపీలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. ఈ స్కామ్ లో కొంతమంది మధ్యవర్తులు సంపాదించి ఉండొచ్చు, కానీ వేల కోట్ల రూపాయలుగా దాచుకున్నది మాత్రం ఈ స్కామ్ అసలు సూత్రధారే. మనీలాండరింగ్ ద్వారా వైట్ చేసిన డబ్బు కూడా చివరికి ఆయనకే చేరింది. ఈ మొత్తం ఎవరికో అధికారులకు క్లియర్‌గా తెలుసు. అయితే సీఐడీ-సిట్ ఆ దిశగా ఎంత వరకు దర్యాప్తు చేసిందన్నది మాత్రం బయటికి వెల్లడించలేదు. ఇప్పటికైతే ఒక్కరి తర్వాత ఒకరిని మాత్రమే అరెస్టు చేయడం జరుగుతోంది. అసలు సూత్రధారి వైపు కేసు త్వరగా వెళ్లగలిగితేనే దర్యాప్తు బలంగా నిలుస్తుంది.

వివరాలు 

మందు బాబుల శాపనార్ధాలు నెరవేరాలంటే సిట్ వేగం పెరగాలి

ఐదేళ్ల కాలంలో మద్యం వినియోగం తగ్గించే పేరుతో రేట్లు భారీగా పెంచారు. ఆ పెరిగిన ధరలకి నకిలీ మద్యం తయారు చేసి అమ్మారు.బయటి బ్రాండ్లు ఏపీలోకి రానివ్వలేదు. ఏపీ బ్రాండ్లను ఇతర రాష్ట్రాల్లో అమ్మకుండా అడ్డుకున్నారు. పెద్ద కంపెనీల అసలైన బాటిళ్లలా కనిపించే నకిలీ మద్యాన్ని మార్కెట్లోకి విసిరి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బు బంగారం, పెట్టుబడులు వంటి రూపాల్లో తిరిగి సూత్రధారికే చేరింది. ఈ లింక్ పూర్తిగా బయటపడే వరకు కేసు సాగుతూనే ఉంటుంది. కానీ అలా ఎక్కువకాలం లాగితే ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే సిట్ దర్యాప్తును కొంచెం వేగవంతం చేయడం తప్పనిసరి. అలా జరిగితే ఐదేళ్లపాటు శపించిన లక్షలాది మందు బాబులకి న్యాయం జరిగినట్టే.

వివరాలు 

ఇంకా చాలా కేసులున్నాయి… ఈ కేసుకు ఒక క్లైమాక్స్ అవసరం

ఆ ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇప్పటికే అనేక కేసులు సిద్ధంగా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే, ప్రజలకు ఇది రొటీన్‌గా అనిపించే ప్రమాదం ఉంది. ముందుగానే వెలుగులోకి వచ్చిన ప్రధాన కేసులకు స్పష్టమైన ముగింపు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పటికే చాలామంది నిందితులు జైల్లోనే ఉండగా, కొందరికి బెయిల్ వచ్చినా వారి బెయిళ్ల రద్దు పిటీషన్లు నడుస్తున్నాయి. ఇది ఎంత కాలం సాగితే అంత ఎక్కువగా ప్రజలకు ఆసక్తి తగ్గిపోవచ్చు. అందుకే ఒక లాజికల్ ముగింపు ఇవ్వడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం అవసరం.