Loading...
AP Local Body Polls: ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై పవన్‌ కళ్యాణ్‌తో కూటమి నేతల భేటీ
ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై పవన్‌ కళ్యాణ్‌తో కూటమి నేతల భేటీ

AP Local Body Polls: ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై పవన్‌ కళ్యాణ్‌తో కూటమి నేతల భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఏయే స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపాలనే అంశంపై నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. Embed

వివరాలు 

సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చలు

జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌, వంశీ కృష్ణ, చిల్లపల్లి శ్రీనివాస్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి నేతలు ఇప్పటికే సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏయే ప్రాంతాల్లో ఏ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించాలనే అంశాన్ని పరిశీలించారు.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌తో ఆయా పార్టీల ముఖ్యనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూటమిలో కీలక భేటీ.. జనసేన కార్యాలయానికి టీడీపీ నేతలు!

ADVERTISEMENT