LOADING...
Andhra Pradesh: ఏపీ ఎల్ఆఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్'కు నేడే చివరి తేదీ.. గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!
గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!

Andhra Pradesh: ఏపీ ఎల్ఆఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్'కు నేడే చివరి తేదీ.. గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ (LRS) స్కీమ్‌కి సంబంధించిన దరఖాస్తులు గతేడాది జులై నుండి స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా అందజేస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే గడువును పలుమార్లు పొడిగించింది. అయితే, ఈసారి పొడిగింపు సమయం కూడా నేటితో (జనవరి 23) ముగియనుంది. నేటితో గడువు ముగింపు: ఎల్ఆర్ఎస్ గడువు ముగియనుండగా, ప్రభుత్వానికి మరోసారి పొడిగింపు కోసం ప్రతిపాదన అందినట్టు సమాచారం. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి దరఖాస్తుల కోసం మరో 3 నెలలు గడువు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు.

వివరాలు 

పొడిగింపు అవకాశం:

పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి గడువు పొడిగింపు కోసం విజ్ఞప్తులు అందుతున్నాయని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించవచ్చని ఆశాజనకంగా భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 53,000 పైగా దరఖాస్తులు అందినట్లు నమోదు అయ్యాయి. గడువు పొడిగిస్తే, మరికొన్ని దరఖాస్తులు రాకూడచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఫీజులపై రాయితీ:

ఇక నేటివరకు ఫీజులు చెల్లించే వారికి డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 50 శాతం రాయితీ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్లాట్ మొత్తం విలువలో 14 శాతం చెల్లించాల్సిన మొత్తం, డిస్కౌంట్ తర్వాత కేవలం 7 శాతం చెల్లించాలి. అయితే, ఈ డిస్కౌంట్ ఈనెల 23వ తేదీ వరకు ఫీజులు చెల్లించే వారికే వర్తిస్తుంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ వర్తించని ప్రాంతాలు: ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులు, గ్రీన్ బఫర్ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలోని ప్లాట్లు ఈ స్కీమ్‌కి లోబడవు. ఇప్పటికే ప్రభుత్వం సంబంధిత మార్గదర్శకాలు కూడా ప్రకటించింది. కేవలం నిబంధనలకు లోబడి ఉన్న ప్లాట్లు, లేఔట్లలోనే క్రమబద్ధీకరణ జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం: https://dtcp.ap.gov.in/LRS/

Advertisement