
AP News: ఏపీ మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త ప్రకటించింది.
ఆస్తి పన్నుపై వడ్డీ తగ్గింపును ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిలపై 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు మంగళవారం జీవో విడుదల చేసింది.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అలాగే పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఈ వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం
🔹అమరావతి: ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం
— Akashvani News Vijayawada (@airnews_vja) March 25, 2025
🔹ఈ నెలాఖరు వరకూ పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ
🔹ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు,పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం రాయితీ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం pic.twitter.com/3oEHq838SO