Loading...
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్ పై ఎస్‌ఈసీ కొత్త నిబంధనలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్ పై ఎస్‌ఈసీ కొత్త నిబంధనలు

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్ పై ఎస్‌ఈసీ కొత్త నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణలో అభ్యర్థుల పేర్లు,రాజకీయ పార్టీల వివరాలు ఎలా ఉండాలనే అంశంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్లలో అభ్యర్థుల పేర్ల ముద్రణకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు,రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులుగా విభజించి వివరాలను ముద్రించాలని సూచించింది.

వివరాలు 

పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల గుర్తులను ముద్రించకూడదు 

పోస్టల్ బ్యాలెట్‌లోని అభ్యర్థుల ప్యానెల్‌పై ముందుగా తెలుగులో అభ్యర్థి పేరు, పార్టీ పేరు ముద్రించాలి.

వాటి కింద ఆంగ్లంలోనూ అదే వివరాలను ముద్రించాలని స్పష్టం చేసింది.

పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి ఎన్నికల గుర్తులను (సింబల్స్) ముద్రించకూడదని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది.

ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థుల పేర్ల కింద తెలుగులో, ఆంగ్లంలో 'ఇండిపెండెంట్' (Independent) అని పేర్కొనాలని ఆదేశించింది.

ఇక సాధారణ బ్యాలెట్ పత్రం, పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల పేర్ల వరుసక్రమం ఒకే విధంగా ఉండాలని ఎస్‌ఈసీ వెల్లడించింది.

ఓటింగ్ ప్రక్రియలో గందరగోళానికి తావులేకుండా రెండు రకాల బ్యాలెట్ పత్రాల్లోనూ అభ్యర్థుల పేర్ల క్రమాన్ని సమానంగా ఉంచాలని ఈ మార్గదర్శకాల ద్వారా స్పష్టం చేసింది.

ADVERTISEMENT