Loading...
Andhra Pradesh: ఏపీలో 23 మున్సిపల్ స్థానిక సంస్థలకు రేపే ఎన్నికల షెడ్యూల్
ఏపీలో 23 మున్సిపల్ స్థానిక సంస్థలకు రేపే ఎన్నికల షెడ్యూల్

Andhra Pradesh: ఏపీలో 23 మున్సిపల్ స్థానిక సంస్థలకు రేపే ఎన్నికల షెడ్యూల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోపెండింగ్‌లో ఉన్న 23 మున్సిపల్ స్థానిక సంస్థలకు గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 12న మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తొలగిపోవడంతో ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా

ADVERTISEMENT