Andhra pradesh: ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ ఖరారు.. చిన్న సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ (ఎన్‌డబ్ల్యూఎస్) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ విధానం నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి ఐదేళ్ల కాలం వరకు అమలులో ఉంటుంది. చిన్న సంస్థలు తమ కార్యకలాపాలు నెరవేర్చడానికి అవసరమైన వర్క్‌స్పేస్, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఆర్థిక భారం తగ్గించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి, ఫ్రీలాన్సర్లకు,ఐటీ అంకుర సంస్థలకు కార్యాలయాలు నడపడానికి అవసరమైన వర్క్‌స్పేస్‌ను అందించే సంస్థలను ఈ విధానం ప్రోత్సహిస్తుంది. ప్రైవేట్ భాగస్వాములను మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
వసతుల అవసరం:
వర్క్‌స్పేస్‌లను ఏర్పాటు చేసే వారికి ఈ పాలసీ కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం చేయడం, గిగ్ ఎకానమీని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం. కనీసం 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం కనీసం 10 సీట్లు సామర్థ్యం కలిగిన వర్క్‌స్టేషన్ ఏర్పాటుచేయాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కనీసం 10 సీట్లతో సమావేశాలు నిర్వహించగల ఏర్పాట్లు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ప్రింటింగ్, స్కానింగ్ సదుపాయం మినీ ప్యాంట్రీ మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గదులు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సీసీటీవీ కనెక్టివిటీ
వివరాలు
ఎన్‌డబ్ల్యూఎస్ డెవలపర్లకు ప్రోత్సాహకాలు:
అద్దె ప్రోత్సాహకం: మండల పరిధిలో మొదటగా ఏర్పాటు చేసే ఎన్‌డబ్ల్యూఎస్‌కి 5 సంవత్సరాలు అద్దె మినహాయింపు. ప్రభుత్వ భవనాలుంటే,నామమాత్రపు అద్దెకు కేటాయింపు. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసే వాటికి: అద్దెలపై 50%రాయితీ,ఏటా గరిష్ఠంగా రూ.6లక్షలు. ఇంటీరియర్ డెవలప్‌మెంట్: ఎర్లీబర్డ్ కింద, మండల పరిధిలో మొదటగా ఏర్పాటు చేసిన సంస్థలకు పెట్టుబడిలో 60%రాయితీ,గరిష్ఠంగా రూ.15లక్షలు. ఆ తర్వాత ఏర్పాటు చేసే వాటికి 50%రాయితీ, గరిష్ఠంగా రూ.7.5 లక్షలు. ఐటీ హార్డ్‌వేర్, ఫెసిలిటీ: మూలధన వ్యయంలో 50% రాయితీ,గరిష్ఠంగా రూ.5లక్షలు. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్: హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు ఖర్చులో 50% రాయితీ,గరిష్ఠంగా ఏడాదికి రూ.1 లక్ష చొప్పున ఐదేళ్ల పాటు చెల్లింపు. వడ్డీ రాయితీ: 8% వడ్డీ రాయితీ చొప్పున,నెలకు రూ.10,000 చెల్లింపు,ఐదేళ్ల పాటు.