NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
    Ap Palnadu Murders : ఏపీలో ఘోరం.. భర్త సహా అత్తమామల హత్య

    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 23, 2023
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.

    ఈ ముగ్గురిని బంధువులే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలోనే హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

    ఈ క్రమంలోనే మృతులు కోనంకి చెందిన సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పేర్కొన్నారు.

    సాంబశివరావు కోడలు మాధురి బంధువులే ఈ హత్యలు చేశారని పోలీసులు వెల్లడించారు. హత్యల తర్వాత నిందితులు తమకు లొంగిపోయారన్నారు.

    DETAILS

    మాధురిని వేధిస్తుండటంతో ఆమె తరుఫున బంధువులు దారుణానికి పాల్పడ్డారు : పోలీసులు 

    గత కొన్నాళ్లుగా నరేష్, తల్లిదండ్రులతో కలిసి తన భార్య మాధురిని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా ఆశించిన మేర ఫలితం తీసుకురాలేకపోయింది.

    ఈ సందర్భంగా వేధింపులు ఎక్కువడంతో ముగ్గురిని హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నరేష్ భార్య మాధురి, బంధువులతో సహా ముప్పాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.

    దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మాధురిని వేధిస్తుండటంతో ఆమె తరుఫున బంధువులు విచక్షణ కోల్పోయి అర్థరాత్రి తీవ్ర దాడి చేసి కత్తులతో నరికి చంపారు.

    ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను పిడుగురాళ్లకు తరలించి గ్రామంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భారీగా పోలీస్ బందోబస్తును సిద్ధం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    హత్య

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు  చంద్రబాబు నాయుడు
    దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే.. దసరా నవరాత్రి 2023
    స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్  సీఐడీ
    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    హత్య

    Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు దిల్లీ
    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు  రాజస్థాన్
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025