AP Rain Alert: ద్రోణి ప్రభావంతో నేడు,రేపు ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.
వివరాలు
ఈ జిల్లాల్లో వర్షాలు
కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపారు.
వర్షాలు కురిసే సమయంలో, ఈదురుగాలులు వీచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు, గాలుల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రానున్న రెండు రోజులు వర్ష సూచన : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
🔸రానున్న రెండు రోజులు వర్ష సూచన : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 14, 2026
వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA వెల్లడించింది. pic.twitter.com/qxBDpO7pmj