Loading...
Andhra Pradesh: ఏపీలో ఎంపీపీ,జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్
ఏపీలో ఎంపీపీ,జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్

Andhra Pradesh: ఏపీలో ఎంపీపీ,జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 19న ఎంపీపీ ఎన్నికలు, 20న జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజాపరిషత్‌లకు ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 28 జిల్లా పరిషత్‌లకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను చేతులెత్తే విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు.

వివరాలు 

జడ్పీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం

ఈ నెల 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో 499 స్థానాలను కూటమి గెలుచుకుంది.

ఇది మొత్తం స్థానాల్లో 85.73 శాతం. వైకాపా 76 స్థానాలతో (13.05 శాతం) సరిపెట్టుకుంది.

కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన తెదేపా 407, జనసేన 72, భాజపా 20 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఇతరులు మరో ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఏడు జిల్లాల్లో కూటమి అన్ని స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది.

మరోవైపు మూడు జిల్లాల్లో వైకాపా ఒక్కో స్థానానికే పరిమితమైంది. ఇంకో ఏడు జిల్లాల్లో రెండేసి స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

వివరాలు 

ఎంపీటీసీల్లోనూ కూటమిదే పైచేయి

ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 7,799 స్థానాలను కూటమి తన ఖాతాలో వేసుకుంది.

ఇందులో తెదేపా 6,585, జనసేన 1,044, భాజపా 170 స్థానాలను గెలుచుకున్నాయి. వైకాపా 1,801 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది.

ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 195 మంది విజయం సాధించారు.

ఈ ఫలితాల నేపథ్యంలో తాజాగా ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

ADVERTISEMENT