Loading...
AP State Election Commission: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన
స్థానిక ఎన్నికల అభ్యర్థుల వివరాలు ఇక ఆన్‌లైన్‌లో..

AP State Election Commission: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే నామినేషన్‌ పత్రాలు,అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు,అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన శివకార్తీక్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఎస్‌ఈసీ.. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు,అఫిడవిట్లను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని న్యాయస్థానానికి తెలిపింది. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ADVERTISEMENT