తదుపరి వార్తా కథనం

Atchannaidu Mother: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేకి మాతృవియోగం
వ్రాసిన వారు
Stalin
Mar 31, 2024
05:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్యెల్యే కింజరాపు అచ్చన్నాయుడు మాతృమూర్తి ఆదివారం కన్నుమూశారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మడా స్వగ్రామంలో అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ(90) మృతి చెందారు.
కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు.ఎర్రన్నాయుడు, హరివరప్రసాద్, ప్రభాకర్, అచ్చెన్నాయుడు మగ సంతానం.
ఆమె మరణంతో కింజరాపు కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
కళావతమ్మ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలుపుతున్నట్టు వెల్లడించారు.
అమ్మగారి మరణం కింజారపు కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.