Andhra Pradesh: తల్లీబిడ్డల కోసం త్వరలో 500 అధునాతన ఎక్స్‌ప్రెస్ వాహనాలు
ఈ వార్తాకథనం ఏంటి
మాతాశిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో అధునాతన సౌకర్యాలు కలిగిన 500 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీ, ఎంయూవీ వాహనాలను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వాహనాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల అవసరాలకు అనుగుణంగా కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అలాగే వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ డిజైన్ల నమూనాలను పరిశీలించి ఆమోదం తెలిపారు.
వివరాలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల 2.75 లక్షల మందికి ద్వారా ప్రయోజనం
ఈ సందర్భంగా వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ సీఎంకు వివరాలు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది ఈ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జీపీఎస్ ఆధారిత రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.