LOADING...
Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ 
విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ

Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) చేపట్టిన పర్సనల్‌ ఎడాప్టివ్‌ లెర్నింగ్‌ (పాల్‌) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పాల్‌ అమలుపై పరిశోధన ఫలితాలను ఢిల్లీ లోని కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ స్వయంచాలిత అభ్యసన విధానాన్ని సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌,యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌తో కలసి రాష్ట్రంలోని మొత్తం 1,224 పాఠశాలల్లో అమలు చేస్తున్నది. ఇందులో 14,000 మంది 6-9 తరగతుల విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా గణితం, తెలుగు, ఆంగ్ల భాషలపై అభ్యసన సదుపాయాన్ని పొందుతున్నారు.

వివరాలు 

సాధారణ పాఠశాలల పిల్లల కంటే 2.35 రెట్లు అధికం

పాల్‌ అమలవుతున్న 60 పాఠశాలల్లో గణిత విషయంపై విద్యార్థుల సామర్థ్యాలపై ప్రత్యేకంగా అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయన ఫలితాల ప్రకారం, దేశవ్యాప్తంగా పాల్‌ 12 రాష్ట్రాల్లో అమలవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ టాప్ లో నిలిచింది. ప్రాంతీయంగా పాల్‌ అమలు చేస్తున్న పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఇతర సాధారణ పాఠశాలల పిల్లల కంటే 2.35 రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో నిర్ధారించారు.