LOADING...
Driver Cum Guide Services in AP :పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం
ర్యాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం

Driver Cum Guide Services in AP :పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రముఖ రవాణా సంస్థ రాపిడోతో కలిసి రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో డ్రైవర్-కమ్-గైడ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోకి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు సులభంగా మార్గదర్శకత్వం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటివరకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే గైడ్ కోసం ప్రత్యేకంగా వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు అదే డ్రైవర్ పర్యాటకులను కార్లు, ఆటోలలో తీసుకెళ్లడంతో పాటు అక్కడి చరిత్ర, విశిష్టతలను కూడా వివరించనున్నాడు. రాష్ట్ర పర్యాటక సంస్థ,ర్యాపిడో సంయుక్తంగా రూపొందించిన టూరిజం టూరిస్ట్ గైడ్ ప్రోగ్రామ్ను మొదటగా ప్రయోగాత్మకంగా విజయవాడలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ర్యాపిడోలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన 280 మంది కారు,ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

వివరాలు 

పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

దేశంలోనే మొదటిసారిగా అమలు చేయనున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని మొదటి దశ విజయవంతమైతే విశాఖపట్నం, తిరుపతి నగరాలకు కూడా విస్తరించనున్నారు. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుంచి నేరుగా సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటివరకు సులభమైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించడానికి ర్యాపిడో సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగంగా రూపొందిస్తున్న సేవే టూరిజం టూరిస్ట్ గైడ్ వ్యవస్థ.

వివరాలు 

ర్యాపిడో యాప్‌లో కొత్త టూరిస్ట్ గైడ్ ఐకాన్

ర్యాపిడో యాప్‌లో త్వరలో "టూరిస్ట్ గైడ్" అనే ప్రత్యేక ఐకాన్ అందుబాటులోకి రానుంది. ఈ ఐకాన్‌ను ఓపెన్ చేసిన వెంటనే విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 ప్రముఖ పర్యాటక ప్రాంతాల వివరాలు కనిపిస్తాయి. పర్యాటకులు తమకు కావాల్సిన ప్రదేశాలను ఎంపిక చేసుకున్న తర్వాత గుర్తింపు పొందిన గైడ్-కమ్-డ్రైవర్లు కార్లు లేదా ఆటోలలో తీసుకెళ్తారు. ప్రయాణ సమయంలో ఆ ప్రాంతాల చరిత్ర, నిర్మాణాల ప్రత్యేకతలు, సంస్కృతి గురించి వివరంగా చెప్పనున్నారు. టూర్ ప్యాకేజీల ధరలను పర్యాటక శాఖ,ర్యాపిడో కలిసి నిర్ణయించి త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement

వివరాలు 

ప్రత్యేకంగా సర్టిఫైడ్ డ్రైవర్-గైడ్లు

విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. అమరావతి స్థూపం కొండపల్లి కోట ఉండవల్లి గుహలు భవానీ ఐలాండ్ సూర్యలంక బీచ్ మంగినపూడి బీచ్ నాగార్జునసాగర్ కొండపల్లి బొమ్మలు మంగళగిరి చేనేత వస్త్రాలు కూచిపూడి గ్రామం పవిత్ర సంగమం కనకదుర్గ ఆలయం పానకాలస్వామి ఆలయం వంటి ప్రాంతాల చరిత్ర, విశిష్టతలను డ్రైవర్లకు వివరంగా తెలియజేస్తున్నారు. పర్యాటకులకు చారిత్రక అంశాలను ఎలా చెప్పాలి అనే విషయాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర చరిత్ర,సంస్కృతి,పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత,పర్యాటకులతో మర్యాదగా వ్యవహరించే విధానం,భద్రతా ప్రమాణాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు.

Advertisement

వివరాలు 

విదేశీ పర్యాటకులతో మాట్లాడేలా శిక్షణ

ర్యాపిడో యాప్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక ఐకాన్ ద్వారా పర్యాటకులు సర్టిఫైడ్ డ్రైవర్-గైడ్లను నేరుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణలో భాగంగా విదేశీ పర్యాటకులతో సులభంగా సంభాషించేందుకు డ్రైవర్లకు భాషిణి యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బౌద్ధ సర్క్యూట్, అమరావతి, నాగార్జునసాగర్ వంటి చారిత్రక ప్రదేశాల విశిష్టతలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే పర్యాటకుల భద్రత, వారితో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై కూడా సూచనలు అందిస్తున్నారు. శిక్షణ పొందుతున్న 280 మంది డ్రైవర్లలో 248 మంది ఆటో డ్రైవర్లు కాగా, మరో 32 మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు.

Advertisement