
AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన పర్యాటక పాలసీ 2024-2029ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.
సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో ఈ కొత్త పాలసీని రిలీజ్ చేశారు.
మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పెట్టుబడిదారులతో చర్చలు జరపగా, వారి నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు.
పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.
నూతన పర్యాటక పాలసీ 2024-2029 ప్రకారం రాష్ట్రంలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
Details
పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహం
పర్యాటక రంగంలో విశాలమైన సముద్రతీరాలు, అద్భుతమైన చారిత్రక వారసత్వం, ప్రకృతి సంపద, సజీవ నదుల వంటి గొప్ప అవకాశాలున్నాయని వివరించారు.
పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ వివరాలను తెలియజేస్తూ, భయాందోళన లేకుండా పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించారు.
రాష్ట్రం కోసం రూపొందించిన ఈ సమగ్ర పర్యాటక విధానం పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.