Page Loader
Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు
విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు

Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించింది. ఈ మేరకు 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది . విశాఖ రిషికొండపై ఉన్న మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను హై లెవల్ కమిటీ గుర్తించింది.

DETAILS

ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఆ టవర్స్ : సీఎస్

మిలీనియం టవర్స్‌లోని A, B టవర్స్‌ను ఈ మేరకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలన్నారు. వెసులుబాటు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు ఏపీ సర్కార్ సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే గురువారం ఏపీ సీఎస్ కీలక ఉత్తర్వులను వెలువరించారు.