
ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కులాంతర వివాహాం జరిగింది.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి స్వయంగా దగ్గరుండీ మరీ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహాన్ని జరిపించారు.
పవన్ అనే యువకుడితో బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సైతం చేయించి ఆదర్శంగా నిలిచారు.
తన కుమార్తె ఇష్ట ప్రకారమే నూతన దంపతులను ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించానని ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడించారు. కలిసి చదువుకునే రోజుల్లో వధు, వధురులు ఇద్దరూ ఇష్టపడటంతో పెళ్లి చేశామన్నారు.
డబ్బు,హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే ఈ వివాహం చేశామని ఎమ్మెల్యే వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కులాంతర వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
#YSRCP MLA #RachamalluSivaPrasadReddy accepted the love marriage proposal of his daughter despite economic and caste differences.
— Daily Culture (@DailyCultureYT) September 7, 2023
They both got married in a registrar's office today without any lavish celebrations pic.twitter.com/ljxzAKsPef