LOADING...
Apache helicopters: భారత ఆర్మీకి త్వరలో అపాచీ హెలికాప్టర్లు.. నేవీలోకి సీహాక్ స్క్వాడ్రన్
భారత ఆర్మీకి త్వరలో అపాచీ హెలికాప్టర్లు.. నేవీలోకి సీహాక్ స్క్వాడ్రన్

Apache helicopters: భారత ఆర్మీకి త్వరలో అపాచీ హెలికాప్టర్లు.. నేవీలోకి సీహాక్ స్క్వాడ్రన్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆర్మీకి అమెరికా నుంచి మిగిలి ఉన్న మూడు అపాచీ AH-64 దాడి హెలికాప్టర్లు త్వరలోనే అందనున్నాయి. ఇదే సమయంలో, భారత నేవీ ఈ వారంలో తన రెండో MH-60R సీహాక్ స్క్వాడ్రన్‌ను అధికారికంగా సేవల్లోకి తీసుకోనుంది. ఈ సీహాక్ హెలికాప్టర్లు ప్రధానంగా సముద్రంలో జలాంతర్గాముల వేట కోసం ఉపయోగించనున్నారు. చాలా కాలంగా ఆలస్యమవుతున్న ఈ అమెరికన్ హెలికాప్టర్ల చేరికతో భారత్‌లో ఉన్న యుద్ధ సదుపాయాల్లో కొంత లోటు తగ్గుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

10 నుంచి 15 ఏళ్లలో వివిధ రకాలుగా వెయ్యికి పైగా హెలికాప్టర్లు

అయితే అసలైన బలం 2028 తర్వాత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు స్వదేశీగా తయారైన 'ప్రచండ' లైట్ కాంబాట్ హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో రావడం మొదలైనప్పుడే కనిపిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు నిపుణులు తెలిపారు. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో వివిధ రకాలుగా వెయ్యికి పైగా హెలికాప్టర్లు అవసరమని భారత సాయుధ దళాలు అంచనా వేస్తున్నాయి. పాతబడ్డ చీతా, చేతక్ హెలికాప్టర్లను తప్పించి, యుద్ధ సామర్థ్యంలో ఉన్న లోటును భర్తీ చేయడమే ఈ కొనుగోళ్ల ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ద్వారా అమలవుతున్న కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు 

రెండు రోజుల్లో భారత్‌కు చేరుకుంటాయి: రక్షణ శాఖ అధికారులు 

'గాల్లో ట్యాంకులు'గా పేరొందిన ఈ అపాచీ గన్‌షిప్‌లు స్టింగర్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, హెల్‌ఫైర్ లాంగ్‌బో ఎయిర్-టు-గ్రౌండ్ మిసైళ్లు, తుపాకులు, రాకెట్లతో సజ్జంగా ఉంటాయి. ఇవి రెండు రోజుల్లో భారత్‌కు చేరుకుంటాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. భారత్ 2020 ఫిబ్రవరిలో అమెరికాతో కుదుర్చుకున్న రూ.5,691 కోట్ల ఒప్పందం ప్రకారం ఆర్మీ కోసం మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. ఒప్పందం ప్రకారం మొదటి మూడు హెలికాప్టర్లు జూలైలోనే రావాల్సి ఉన్నా, ఆ సమయంలో బోయింగ్ సంస్థ ఎదుర్కొన్న సరఫరా సమస్యల కారణంగా తీవ్ర ఆలస్యం జరిగింది.

Advertisement

వివరాలు 

HAL 2028 నుంచి 2033 మధ్య కాలంలో 'ప్రచండ' లైట్ కాంబాట్ హెలికాప్టర్లను అందించా

ఇవే కాకుండా, 2015 సెప్టెంబరులో కుదిరిన రూ.13,952 కోట్ల ఒప్పందం కింద భారత ఎయిర్‌ఫోర్స్ ఇప్పటికే 2019-20 మధ్య 22 అపాచీ హెలికాప్టర్లను సేవల్లోకి తీసుకుంది. ఆర్మీకి వచ్చే అపాచీలు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మోహరించనున్నారు. అక్కడ పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దును దృష్టిలో ఉంచుకుని గత ఏడాది మార్చిలో ప్రత్యేక స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా,ఈ ఏడాది మార్చిలో కుదిరిన రూ.62,700 కోట్ల ఒప్పందం ప్రకారం HAL 2028 నుంచి 2033 మధ్య కాలంలో 'ప్రచండ' లైట్ కాంబాట్ హెలికాప్టర్లను అందించాల్సి ఉంది. వీటిలో 90 హెలికాప్టర్లు ఆర్మీకి,66 ఎయిర్‌ఫోర్స్‌కు అందనున్నాయి. 20 మిల్లీమీటర్ల తుపాకులు, 70 మిల్లీమీటర్ల రాకెట్లు, గాల్లో గాల్లో లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో ఇవి సన్నద్ధంగా ఉంటాయి.

Advertisement

వివరాలు 

2022లో రూ.3,887 కోట్ల ఒప్పందం

తూర్పు లద్దాఖ్, సియాచిన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఖచ్చితమైన దాడులకు ఇవి కీలకంగా మారనున్నాయి. సుమారు 5.8 టన్నుల బరువున్న ఈ 156 ప్రచండ హెలికాప్టర్లు,ఇప్పటికే 2022లో రూ.3,887 కోట్ల ఒప్పందం కింద సేవల్లోకి వచ్చిన 15 ప్రచండ హెలికాప్టర్లకు అదనపు బలంగా నిలవనున్నాయి. దీంతో రాబోయే సంవత్సరాల్లో భారత సైనిక విమాన దళ శక్తి గణనీయంగా పెరగనుంది.

Advertisement