LOADING...
 YS Sharmila Counter To Jagan:వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్.షర్మిల 
వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల

 YS Sharmila Counter To Jagan:వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్.షర్మిల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2024
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు చర్చకు తాను సిద్ధమని తనతోపాటు మేథావులు, ప్రతిపక్షనేతలు వస్తారని టైం ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా షర్మిల పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ప్రయాణంలో ఆమె ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలను విన్నారు. అనంతరం బస్సులోనే ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్న సుబ్బారెడ్డి గారు,మేము మీ హయాంలో జరిగిన అభివృద్ధి చూడటానికి సిద్దంగా ఉన్నాం.టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ.

Details 

'ప్రజా ప్రస్థానం' విజయ స్తూపాన్నిసందర్శించిన  షర్మిల 

మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మాతో బాటు , మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారని అన్నారు. మీరు చేపట్టిన అభివృద్ధి చూడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సుబ్బారెడ్డి గారు. .జగన్ రెడ్డిగారు అనటం న‌చ్చ‌లేదంటున్నారుగా ... మరి జగన్ అన్నగారూ అనే అందాము. దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు`` అని అన్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ముగించిన ఇచ్ఛాపురంలోని 'ప్రజా ప్రస్థానం' విజయ స్తూపాన్ని షర్మిల సందర్శించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ఆశయాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.