LOADING...
Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..
సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింహాద్రి అప్పన్న ఆలయం ఆభరణాల లెక్కలలో తేడాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది. కొన్ని నెలల క్రితం కడప జిల్లా నివాసి ప్రభాకర్ ఆచారి చేసిన ఫిర్యాదును ఆధారంగా, గత నెల 14, 15 తేదీలలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) రాధ ఆలయంలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సమయంలో ఆలయ రిజిస్ట్రర్ వివరాలను నమోదు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మొత్తం 47 స్వామి వారి ఆభరణాల లెక్కల్లో గణనీయమైన వ్యత్యాసం గుర్తించడంతో ఈ విషయం ప్రధాన చర్చా అంశంగా మారింది. తనిఖీల అనంతరం మాజీ ఏఈవో ఆనంద్ కుమార్ , ఆలయ ప్రధాన అర్చకులకు వివరణాత్మక నోటీసులు జారీ చేశారు.

వివరాలు 

దేవస్థానం గోల్డ్ స్మిత్ ద్వారా అర్చకుల సమక్షాన ఒక్కొ ఆభరణానికి తూకం 

ఆ నోటీసుల్లో మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, సంబంధిత వర్గాల నుండి ఇప్పటివరకు సరైన వివరణలు అందించలేదు. ఈ కేసు గురించి రాష్ట్ర దేవాదాయ శాఖ కూడా స్పందిస్తూ, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రిజిస్ట్రర్ వివరాల ప్రకారం,అప్పన్న ఆలయంలో ఉన్న వెండి,బంగారు ఆభరణాలను డీఈవో రాధ 14, 15 తేదీల్లో పూర్తిగా తనిఖీ చేశారు. ప్రతిరోజూ స్వామి కైంకర్యాలకు,అర్చకులు ఉపయోగించే వెండి, బంగారు ఆభరణాలు,వస్తు సామగ్రి వివరాలను దేవస్థానం గోల్డ్ స్మిత్ ద్వారా అర్చకుల సమక్షంలో ఒక్కొక్క ఆభరణానికి తూకం కొలిచి నమోదు చేశారు. అయితే, అర్చకులు స్వామి కైంకర్యం కోసం వినియోగిస్తున్న కొన్ని ఆభరణాలను, అలాగే రిజిస్ట్రర్‌లో నమోదు చేసిన ఆభరణాలను తనిఖీ సమయంలో చూపించలేదు.

వివరాలు 

రికార్డ్ ప్రకారం తదుపరి చర్యలు

ఈ ఘటనపై డీఈవో రాధ సంబంధిత వివరాలతో కూడిన నోటీసులు జారీ చేశారు. ఆలయ కార్యాలయ రిజిస్ట్రర్ ప్రకారం ఉన్న వెండి, బంగారు ఆభరణాలను తనిఖీ సమయంలో చూపించకపోవటానికి కారణాలను మూడు రోజుల్లో వెల్లడించమని సూచించారు. తగిన సమాధానం లేని పక్షంలో, ఆలయ కార్యాలయ రికార్డ్ ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని నోటీసుల్లో స్పష్టంగా తెలియజేశారు.