Page Loader
TG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం
తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం

TG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జస్టిస్ రేణుకా యార, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టులో రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించనున్నారు. ఈ నలుగురు కొత్త న్యాయమూర్తులు శుక్రవారం నుంచి బాధ్యతలు స్వీకరించవచ్చని సమాచారం. తాజాగా తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.