LOADING...
Double-Decker Corridor: ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గంలో డబుల్‌ డెకర్‌.. మెట్రో డీపీఆర్‌లో మార్పులు తప్పవా?
మెట్రో డీపీఆర్‌లో మార్పులు తప్పవా?

Double-Decker Corridor: ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గంలో డబుల్‌ డెకర్‌.. మెట్రో డీపీఆర్‌లో మార్పులు తప్పవా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పంపింది. ఇదే మార్గంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల ద్విమట్ట నిర్మాణానికి ఆమోదం తెలపాలని రహదారులు, భవనాల శాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రెండో ప్రతిపాదనకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గట్టిగా అభ్యర్థిస్తున్నారు. నాగ్‌పుర్‌ తరహాలో కింద రహదారి, పైన మెట్రోరైలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డబుల్‌ డెకర్‌ ప్రతిపాదన ముందుకు రావడంతో ఈ మార్గానికి సంబంధించిన మెట్రో నివేదికలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

వనస్థలిపురం వద్ద స్థానికుల అభ్యంతరాలతో నిలిచిన పనులు 

జాతీయ రహదారి 65పై వాహన రద్దీ పెరిగి ప్రమాదాలు, ట్రాఫిక్‌ సమస్యలు అధికమవడంతో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఇప్పటికే పలు వాహనాల అండర్‌పాస్‌లు నిర్మించారు. అయితే వనస్థలిపురం వద్ద స్థానికుల అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్‌, మెట్రో వేర్వేరుగా కాకుండా ఒకేసారి డబుల్‌ డెకర్‌ నిర్మాణం చేపడితే ప్రయోజనం ఉంటుందని రహదారులు, భవనాల శాఖ భావిస్తోంది. మెట్రోతో సంబంధం లేకుండానే ఈ శాఖ రూపకల్పనలను సిద్ధం చేసింది. డబుల్‌ డెకర్‌ నిర్మాణంలో మొదటి అంతస్తులో జాతీయ రహదారి మూడు మార్గాలు, పైభాగంలో రెండు వరసలుగా మెట్రోరైలు మార్గం ఉండేలా రూపకల్పన చేశారు.

వివరాలు 

మెట్రో కోసం మళ్లీ రహదారి విస్తరణ అవసరం ఉండదు 

కేంద్రం ఆమోదం లభిస్తే మెట్రో కోసం మళ్లీ రహదారి విస్తరణ అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. బేగంపేటలో మాదిరి భవనాల సమీపంలోంచి మెట్రో వెళ్లే తిప్పలు, వాటిలో నివసించేవారికి శబ్దాల గోల తప్పనుంది. సర్వీస్‌ రోడ్డులో స్తంభాలు లేకుండా వాహనాలు సాఫీగా ప్రయాణించే అవకాశం ఉంటుందని స్థానికులు డబుల్‌ డెకర్‌ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు.

Advertisement