APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.
ఈ ప్రకారం, 8 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ నెలలో నిర్వహించబడనున్నాయి.
ఏప్రిల్ 27 నుండి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇందులో, అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులతో పాటు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్టు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్‌వో, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వంటి పోస్టులకు కూడా పరీక్షలు జరుగుతాయని వివరించింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతోపాటు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు కూడా ఏప్రిల్‌లో నిర్వహించబడతాయని ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ #APPSC #jobs #examsdate #APNews #AndhraPradesh #telugunewshttps://t.co/gWlXs2cgBa
— Eenadu (@eenadulivenews) January 10, 2025