Page Loader
APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ 
పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ

APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ 

వ్రాసిన వారు Stalin
Apr 29, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లంబసింగి, పాడేరు, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రదేశాల్లో విహార యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించబోతోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ మే 5న ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ టూర్, ప్రతి శుక్రవారంతో పాటు వారాంతంలో నిర్వహించబడుతుంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ.2,500గా నిర్ణయించారు. ప్రత్యేక టూర్ ప్యాకేజీ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్‌బీఎస్)లో మే 5న ప్రారంభమై మే 8న ముగుస్తుందని ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎం.యేసుదానం శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

మే 6వ తేదీన ఉదయం 5 గంటలకు లంబసింగి యాత్రం ప్రారంభం

మే 5న ఉదయం 9 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు పీఎన్‌బీఎస్ నుంచి బయలుదేరుతుంది. అది తుని, నర్సీపట్నం మీదుగా మే 6వ తేదీన ఉదయం 5 గంటలకు లంబసింగి చేరుకుంటుంది. ఏజెన్సీ పర్యటన ఉదయం 6 గంటలకు లంబసింగి నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 గంటలకు అల్పాహారం పాడేరులో ఉంటుంది. మొదటి రోజు పర్యాటకులు లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, మోదకొండమ్మ అమ్మవారి ఆలయం, చాపరాయి జలపాతాలను సందర్శిస్తారు. రెండోరోజు అరకు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియాన్ని సందర్శిస్తారు. విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్‌కి డిన్నర్‌కి వచ్చే ముందు బొర్రా గుహలు మరియు కైలాస గిరిని సందర్శిస్తారు.