
APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
వచ్చే నెల నుంచి ప్రతి నెలా వేతనంలో పాటు నైట్ హాల్ట్ అలవెన్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తమకు హామీ ఇచ్చినట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెల్లడించారు.
అలాగే, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించనున్నట్లు ప్రభుత్వం చెప్పినట్లు నాయకులు పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమంతో పాటు డిమాండ్లను పరిష్కరించనున్నట్లు జగన్ ప్రభుత్వం హమీ ఇచ్చింది.
ఏపీ
2017 నుంచి ఉన్న బకాయిలను క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
2017 నుంచి పే రివిజన్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరగ్గా.. ఇటీవలే వాటన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
డే అవుట్, ఓవర్ టైమ్, నైట్ అవుట్ అలవెన్స్‌లను ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆల్యంగా చెల్లిస్తూ వచ్చింది.
అయితే ఫిబ్రవరి 1 నుంచి క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.
బకాయిల మంజూరు తోడు నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం.
తాజాగా జగన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.