Loading...
Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ
'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ

Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ మోహనన్‌ కున్నుమ్మల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆగస్టు 18న తిరువనంతపురంలో నిర్వహించిన 'విజయతారకం' కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను 'బొద్దింకలు' అంటూ కొందరు పిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాక్‌రోచ్‌ జంతా పార్టీ (CJP)ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ''మీలాంటి విద్యార్థులను కొందరు ఏమని పిలుస్తారో తెలుసా? బొద్దింకలు'' అని కున్నుమ్మల్‌ అన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ''మీరు బొద్దింకలా?'' అని ప్రశ్నించారు. ''కాదంటే మరి మీరేంటి? మీరు సింహాలు కదా?'' అని అడిగారు. అయితే ఆయన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

వివరాలు 

దుర్గాదేవిని ఆదర్శంగా తీసుకుని..

దీంతో కున్నుమ్మల్‌ మరోసారి ''మీరు బొద్దింకలా.. సింహాలా? గట్టిగా చెప్పండి'' అని కోరారు.

అయినప్పటికీ విద్యార్థులు మౌనంగానే ఉన్నారు. ''మీకు ఇంకా సందేహంగా ఉందా? తాము బొద్దింకలు కాదని భావించే వారు గట్టిగా, స్పష్టంగా చెప్పండి'' అని ఆయన అన్నారు.

చివరకు ఒకరిద్దరు విద్యార్థులు 'కాదు' అని సమాధానం ఇచ్చినా.. మిగతా విద్యార్థుల నుంచి స్పందన రాకపోవడంతో ఆయన వారిని కూడా సమాధానం చెప్పాలని కోరారు.

విద్యార్థులు బొద్దింకల్లా కాకుండా సింహాల్లా ఉండాలని కున్నుమ్మల్‌ సూచించారు.

దుర్గాదేవిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని, బొద్దింకల్లా ఉండకూడదని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై వివాదం మొదలైంది.

వివరాలు 

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి కున్నుమ్మల్

ఆగస్టు 15న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నిర్వహించిన ఓ కార్యక్రమానికి కున్నుమ్మల్‌ హాజరుకావడంపై గతంలోనే విమర్శలు వచ్చాయి.

ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'వందే మాతరం' అనడానికి వ్యతిరేకంగా ఉండేవారికి తమ తల్లి ఎవరో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.

''తల్లి ఎవరో తెలుసుకుని, తల్లి విలువను అర్థం చేసుకున్న వారు ఎప్పుడూ వందే మాతరం అంటారు'' అని కున్నుమ్మల్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రారంభించిన 'విజయతారకం' కార్యక్రమం

గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రారంభించిన 'విజయతారకం' కార్యక్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

కున్నుమ్మల్‌ 'బొద్దింకలు' అనే పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించారో తనకు అర్థం కాలేదని గవర్నర్‌ అన్నారు.

''మా డాక్టర్‌ మోహనన్‌ కొందరిని బొద్దింకలుగా ప్రస్తావించారు. ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు. మనమంతా బొద్దింకలమా? బొద్దింకలు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. నేను సింహంగా మారగలనా? బహుశా ఆయన చెప్పాలనుకున్నది అదే కావచ్చు'' అని అర్లేకర్‌ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT