తదుపరి వార్తా కథనం

Revanth Reddy: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి… తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 07, 2025
05:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, న్యాయస్థానం తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్టుప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత వాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కింది కోర్టులో విచారణలో ఉంది. అయితే,కేసును కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన అనంతరం, తుది నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచినట్లు తెలియజేసింది.