Kolkata Rape Case: ఆర్జీకర్ హత్యాచార కేసు.. సంజయ్ రాయ్ దోషిగా నిర్ధారణ
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపింది.
ఈ కేసులో శనివారం కోల్‌కతాలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది.
శిక్షను ఖరారు చేయడానికి ఈ నెల 20న తేదీని నిర్ణయించింది.
ఈ తీర్పు హత్యాచార ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరగడంతో వైద్య, సామాజిక వర్గాల ప్రశంసలు వస్తున్నాయి.
Details
ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ కు బెయిల్ మంజూరు
ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్‌కతా పోలీసులు సంజయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను సాక్ష్యాల తారుమారుపై అరెస్టు చేశారు.
అయితే అనుబంధ ఛార్జ్‌షీట్‌ను 90 రోజుల్లో సమర్పించకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. తద్వారా శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.