Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు. బాలికను ఆహారం పెట్టకుండా, బట్టలు విప్పి, రక్తస్రావం అయ్యేంత వరకు కొట్టారు. అంతేకాకుండా ఆర్మీ మేజర్ శైలేంద్ర యాదవ్, అతని భార్య కిమ్మీ రాల్సన్ దంపతులు ఆ బాలికను చెత్త కుండీలోంచి తినమని బలవంతం చేశారు. విరిగిన పళ్ళు, కాలిన గుర్తులతో సహా ఆమె శరీరమంతా గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితులైన దంపతులు ఈ ఆరోపణలను ఖండించారు. ఆ బాలిక మెట్లపై నుంచి పడిపోవడం వల్లే బాలికకు గాయాలయ్యాయని చెప్పారు.
ముక్కు పగుళ్లు, నాలుకపై గాయాలు..
గత రెండేళ్లలో నిందితురాలైన మహిళ బాధితురాలిని రోలింగ్ పిన్‌తో కొట్టి, ఆమె జుట్టును లాగి, గదిలో బంధించిందినట్లు పోలీసులు తెలిపారు. తనపై వేడినీరు పోసినట్లు ఆ బాలిక తాను ఫిర్యాదులో పేర్కొంది. తనను నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత తన రక్తాన్ని తానే నొక్కి బయటకు తీసుకోమ్మని బలవంతం చేసిందని ఆరోపించింది. బాలిక ముక్కు పగుళ్లు, నాలుకపై లోతైన కోతలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఇది సోషల్ మీడియాలో లీక్ కావడంతో, పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు. దీంతో పోలీసులు నిందితులపై పోక్సో, అట్రాసిటీ చట్టం కింద అభియోగాలు మోపారు.