Page Loader
Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు
కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు

Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్మీకి చెందిన 'డేర్‌ డెవిల్స్‌' (Daredevils) ఒక కొత్త రికార్డును సృష్టించింది. వారు కదిలే మోటార్ సైకిళ్లపై హ్యూమన్ పిరమిడ్ ద్వారా ప్రపంచ రికార్డును నమోదు చేశారు. ఈ అసాధారణ ఘనత దిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్‌ సాధించారు. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ విన్యాసంలో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ సైకిళ్లపై నిలబడి, కర్తవ్యపథ్‌లోని విజయ్‌చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 2 కిలోమీటర్ల దూరం రైడ్‌ కొనసాగించారు. ఈ జట్టులో సిగ్నల్స్‌ కార్ప్స్‌ ఆర్మ్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.వి. కుమార్‌ కూడా ఉన్నారు.

వివరాలు 

33 ప్రపంచ రికార్డులు 

తాజా ఫీట్‌తో డేర్‌డెవిల్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ పేరు పొందింది. ఈ ప్రదర్శన ద్వారా 33 ప్రపంచ రికార్డులను సాధించింది. డేర్‌డెవిల్స్‌ 1935లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,600సార్లు మోటార్‌ సైకిళ్లపై విన్యాసాలు చేశాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లు, ఆర్మీ డే పరేడ్‌లు వంటి మిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇచ్చింది.