Page Loader
Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 
Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Dec 09, 2023
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది. అందులో ఒకటి 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం కాగా.. రెండోది ఆరోగ్య శ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణ చేయొచ్చు. ఈ రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రారంభించారు. అలాగే మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకంను మహిళా మంత్రులు పచ్చ జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. అలాగే బాక్సర్ నిఖత్ జరీన్‌కు రేవంత్ రెడ్డి స్వయంగా రూ.2కోట్ల చెక్కును అందజేశారు.

రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లి అంటే గుర్తుకొచ్చేది సోనియమ్మ రూపం: రేవంత్ రెడ్డి

రెండు గ్యారంటీల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రజలకు పండగ రోజని రేవంత్ రెడ్డి అన్నారు. 2009, డిసెంబర్ 9న ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ప్రక్రియను ప్రారంభించదన్నారు. తెలంగాణ తల్లి అంటే గుర్తుకొచ్చేది సోనియమ్మ రూపమని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అని సగర్వంగా చెప్పే అవకాశం మనకు సోనియా గాంధీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసమే సోనియమ్మ 6గ్యారంటీలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినట్లు పేర్కొంది. ఇక నుంచి మహిళలు రాష్ట్రంలో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇక నుంచి బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఫ్రీ