LOADING...
Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. బుధవారం ఉదయం నాటికి అక్కడికి చేరిన నీటి ప్రవాహం 7.38 లక్షల క్యూసెక్కులకు చేరిందని అధికారులు వెల్లడించారు. అదే పరిమాణంలో దిగువ వైపుకు నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రాఖర్ జైన్ వివరాల ప్రకారం, గోదావరి మాత్రమే కాకుండా కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహాలు పెరుగుతున్నాయని చెప్పారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 42.2 అడుగులకు చేరిందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

రద సహాయక చర్యల కోసం రూ.16 కోట్లు కేటాయింపు 

అదే విధంగా, కృష్ణా నదిపై ఉన్న విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని తెలిపారు. ఇక్కడ 4.92 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతుండగా, అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభావితమయ్యే అవకాశమున్న జిల్లాల అధికార యంత్రాంగాలను ముందస్తుగా అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.16 కోట్లు కేటాయించామని, అలాగే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచామని ప్రాఖర్ జైన్ తెలిపారు. ప్రజలు వరద ప్రవాహాలు ఉన్న వాగులు, కాలువలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన హెచ్చరించారు.