Page Loader
Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు
Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు

Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు

వ్రాసిన వారు Stalin
Feb 12, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు దాదాపు 325 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆదివారం బాలరాముడిని దర్శించుకున్నారు. బీజేపీ నేతలు దర్శించుకున్న ఒకరోజు తర్వాత ఆప్ నేతలు రామాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఎంలు కేజ్రీవాల్, మాన్ మధ్యాహ్నం 2గంటల సమయంలో అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. కేజ్రీవాల్ తన భార్య సునీతా కేజ్రీవాల్, భగవంత్ మాన్‌, అతని భార్య గుర్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు శ్రీరాముడి దర్శించుకున్నారు. 'ఈ రోజు నా తల్లిదండ్రులు, నా భార్యతో కలిసి అయోధ్యకు రావడం, మందిరంలో శ్రీరాముడిని దర్శించుకోవడం నా అదృష్టం' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్