Page Loader
Sunita Kejriwal: డబ్బు ఎక్కడ ఉందో కేజ్రీవాల్ రేపు కోర్టులో వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు 
కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

Sunita Kejriwal: డబ్బు ఎక్కడ ఉందో కేజ్రీవాల్ రేపు కోర్టులో వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Stalin
Mar 27, 2024
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ అతడిని నిరంతరం విచారిస్తోంది. కాగా, సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ బుధవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌లోని డబ్బంతా ఎటు పోయిందో కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ వెల్లడిస్తారని తేల్చి చెప్పారు. గత 2ఏళ్లుగా దర్యాప్తు సంస్థలు 250 కంటే ఎక్కువ దాడులు నిర్వహించాయన్నారు. ఇప్పటి వరకు ఇన్ని దాడులు చేసినా ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. మనీష్ సిసోడియా , సంజయ్ సింగ్‌, సత్యేంద్ర జైన్‌ ఇంట్లోనూ సోదాలు చేపట్టినా.. కానీ వాళ్లకు ఏ ఆధారాలూ దొరకలేదన్నారు.

Details 

కస్టడీ నుంచి మంత్రులకు పంపుతున్న లేఖలపై విచారణ జరిపించాలి: బీజేపీ  

మరోవైపు, ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను కలిశారు. ఈడీ కస్టడీ నుంచి మంత్రులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపుతున్న లేఖలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు అతడిని మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సంజయ్ అరోరాతో జరిగిన సమావేశంలో పార్టీ ప్రతినిధి బృందం కేజ్రీవాల్ రాసిన లేఖలు వాస్తవమా కాదా అనే దానిపై విచారణ జరిపించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.