Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు మాజీ సీఎం ఖట్టర్ ఎదుట నయాబ్‌సింగ్ సైనీ ప్రమాణం చేశారు.
బీజేపీ నేతలు కన్వర్ పాల్ గుజ్జర్, జై ప్రకాష్ దలాల్, బన్వారీ లాల్, మూల్ చంద్ శర్మతో హర్యానా కేబినెట్ మంత్రులుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు.
స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా కూడా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం గమనార్హం.
హర్యానాలో అధికార బీజేపీ, జేజేపీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీ కూటమి నుంచి జేజేపీ బయటకు వచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాణ స్వీకారం చేస్తున్న సైనీ
#WATCH | Haryana BJP president Nayab Singh Saini takes oath as the Chief Minister of Haryana, at the Raj Bhavan in Chandigarh.
— ANI (@ANI) March 12, 2024
Former Haryana CM Manohar Lal Khattar also present. pic.twitter.com/9se0rPBvWx