LOADING...
Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ 
Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను సదర్ ఆసుపత్రికి తరలించారు.సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Details 

బీహార్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ

2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్‌ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్‌ జిల్లా ఎస్పీ ప్రభాత్‌ తెలిపారు. బీహార్‌లో ఏఐఎంఐఎం నేతను కాల్చి చంపడం ఇది రెండోసారి. సలామ్ మృతిపై స్పందించిన AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.