Page Loader
Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు 
Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు 

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైలులో ఉన్న ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అనారోగ్య కారణాలతో ఆశారాం బెయిల్‌ను కోరారు. కింది కోర్టు విధించిన జీవిత ఖైదుపై ఆశారాం వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాలాంటే, ఆశారాం చికిత్స కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్రలో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో ఆయుర్వేద చికిత్స తీసుకునేందుకు తన క్లయింట్‌ను అనుమతించాలని ఆశారాం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ అభ్యర్థనను కూడా రాజస్థాన్ హైకోర్టుకు తీసుకెళ్లాలని న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.

ఆశారాం

రెండు అత్యాచార కేసుల్లో నేరం రుజువు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 2013లో తన ఆశ్రమంలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో హైకోర్టు ఆశారాంను 2018లో దోషిగా తేల్చింది. దోషిగా నిర్ధారించడంతో అతనికి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అతడి ఇద్దరు సహచరులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో గుజరాత్‌లోని ఆశ్రమంలో సూరత్ మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం కూడా దోషిగా తేలాడు. ఇలా రెండు కేసుల్లో ఆశారాంను కోర్టు దోషిగా తేల్చింది. ఆశారాం వయసు ప్రస్తుతం 80 ఏళ్లుకు పైగా ఉంటుంది. ఆయన అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని ఆశారం తరఫు లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.