ASBL Realty: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏఎస్బీఎల్ రికార్డు.. తొలిరోజే రూ.800 కోట్ల అమ్మకాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్ (ASBL) సరికొత్త రికార్డు సృష్టించింది. సెంట్రల్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'ఏఎస్బీఎల్ లెగసీ' ప్రారంభమైన తొలిరోజే ఏకంగా రూ.800 కోట్ల విలువైన విక్రయాలు నమోదయ్యాయి.
వివరాలు
50 అంతస్తులతో మూడు భారీ టవర్లు
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఇందులో గ్రౌండ్ లెవల్ నుంచి 50 అంతస్తుల ఎత్తుతో మూడు భారీ రెసిడెన్షియల్ టవర్లను అభివృద్ధి చేయనున్నారు.
నగర నడిబొడ్డున విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలనుకునే కొనుగోలుదారుల కోసం 3, 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్లాట్ల విస్తీర్ణం 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల వరకు ఉంటుంది.
వీటి ధరలు రూ.1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి.
వివరాలు
73 శాతం ఓపెన్ స్పేస్.. భారీ క్లబ్‌హౌస్
ఈ ప్రాజెక్టులో మొత్తం స్థలంలో 73.25 శాతాన్ని ఓపెన్ స్పేస్‌గా కేటాయించారు. అంతేకాకుండా 74,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్లబ్‌హౌస్‌ను నిర్మించనున్నారు.
నివాసితుల కోసం 50కి పైగా ఆధునిక జీవనశైలి వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
ఫిట్నెస్, వినోద కార్యకలాపాల కోసం మొత్తం 1.70 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. నిర్మాణ సమయంలో కొనుగోలుదారులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సంస్థ ప్రత్యేక ఫైనాన్సింగ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా 'ఫ్లాట్ అప్పగించే వరకు జీరో ఈఎంఐ' సదుపాయాన్ని అందిస్తోంది.
వివరాలు
సెంట్రల్ హైదరాబాద్‌లోనే ఆధునిక నివాసాలు: అజితేష్ కోరుపోలు
ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏఎస్బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈవో అజితేష్ కోరుపోలు మాట్లాడుతూ.. సెంట్రల్ హైదరాబాద్‌లో నివాసాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
అయితే, సరైన గేటెడ్ కమ్యూనిటీని నిర్మించేందుకు అవసరమైనంత పెద్ద స్థలం దొరకకపోవడమే ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన సమస్యగా ఉండేదని పేర్కొన్నారు.
తమ 'ఏఎస్బీఎల్ లెగసీ' ప్రాజెక్ట్ ఆ లోటును భర్తీ చేస్తుందని వివరించారు.
నగర శివారు ప్రాంతాలకు వెళ్లకుండా ప్రధాన నగరంలోనే ఆధునిక వసతులతో కూడిన నివాసం కోరుకునే వారికి 'ఏఎస్బీఎల్ లెగసీ' మంచి ఎంపికగా నిలుస్తుందని ఆయన అన్నారు.