LOADING...
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పూసపాటి అశోక్‌ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్‌గా అధికారికంగా ప్రమాణం చేశారు. శనివారం ఉదయం 11:30 గంటలకు గోవా రాజ్‌భవన్‌లోని బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయన్ని గవర్నర్‌గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి కిన్జరాపు రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పలు ఎంపీలు కూడా ఈ వేడుకకు హాజరై అశోక్‌ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.