LOADING...
Ashwini Bhide: బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా కమిషనర్‌గా 'మెట్రో విమెన్‌'.. ఎవరీ అశ్వినీ?
బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా కమిషనర్‌గా 'మెట్రో విమెన్‌'.. ఎవరీ అశ్వినీ?

Ashwini Bhide: బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా కమిషనర్‌గా 'మెట్రో విమెన్‌'.. ఎవరీ అశ్వినీ?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కు కొత్త నాయకత్వం దక్కింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అశ్వినీ భిడేను కొత్త కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరుగాంచిన బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో మహిళలకు అవకాశం లభించకపోవడం గమనార్హం. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న భూషణ్ గగ్రానీ పదవీకాలం మార్చి 31తో ముగియడంతో, ఆయన స్థానంలో అశ్వినీ భిడేను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో అనుభవం, కఠిన నిర్ణయాల్లో దిట్టగా గుర్తింపు పొందిన భిడేకు ఈ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

ఎవరు ఈ అశ్వినీ భిడే?

1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వినీ భిడే తన సేవలను కొల్హాపూర్‌లో ప్రారంభించారు. అనంతరం నాగ్‌పూర్, సింధుదుర్గ్ జిల్లా పరిషత్‌లలో సీఈవోగా పని చేసి మంచి పరిపాలకురాలిగా గుర్తింపు పొందారు. రాజ్‌భవన్‌లో కూడా వివిధ కీలక పదవుల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. గత కొన్నేళ్లుగా ముంబయి నగర పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న భిడే,నగర అభివృద్ధిలో ప్రధానంగా మెట్రో ప్రాజెక్టుల ద్వారా తన ముద్ర వేశారు. ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) ఎండీగా పనిచేసిన సమయంలో మెట్రో విస్తరణకు వేగం తీసుకొచ్చారు.

వివరాలు 

మెట్రో ప్రాజెక్టులతో 'మెట్రో విమెన్'గా పేరు

ముఖ్యంగా మెట్రో లైన్-3 ప్రాజెక్టును ముందుండి నడిపించిన అశ్వినీ భిడేకు 'ముంబయి మెట్రో విమెన్'గా గుర్తింపు వచ్చింది. కొలాబా నుంచి సీప్జ్ వరకు సాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. సొరంగ తవ్వకాలు, భూసేకరణ, పునరావాస సమస్యలు వంటి క్లిష్ట అంశాలను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రజల నమ్మకాన్ని సంపాదించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.

Advertisement

వివరాలు 

కీలక బాధ్యతల్లో అనుభవం

ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అశ్వినీ భిడే, ఒకేసారి పరిపాలన,మౌలిక వసతుల అభివృద్ధి రంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించారు. ఇప్పుడు బీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ముంబయి అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమవుతోంది.

Advertisement