 
                                                                                Ashwini Vaishnav: ఒడిశా,తెలుగురాష్ట్రాల్లో రైల్వే వార్‌రూమ్‌లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
'మొంథా' తీవ్ర తుపాను పరిస్థితుల దృష్ట్యా అత్యవసర నిర్ణయాలు త్వరితంగా తీసుకునేందుకు ఒడిశా,తెలుగు రాష్ట్రాల్లో డివిజనల్ వార్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే,ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన పరికరాలు, యంత్రాలు, సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న ఏర్పాట్లపై వివరమైన నివేదికను కోరారు.
వివరాలు
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన
అలాగే, అవసరమైతే మరిన్ని రక్షణ చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు ఇచ్చారు. తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనతో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.